జీవీఎంసీ 54వ వార్డులో సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 54వ వార్డులోని బాపూజీనగర్‌కు చెందిన జామి పార్వతీశం అనే రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆరఎఫ్) నుంచి మంజూరైన రూ.40,000 విలువైన చెక్కును ఈరోజు అందజేశారు. ఈ చెక్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె దీపిక శ్యామల, 54వ వార్డు టీడీపీ అధ్యక్షులు కుట్టా కార్తిక్, 54వ వార్డు బీజేపీ వార్డ్ అధ్యక్షులు రంగుముద్ర రాంబాబు సంయుక్తంగా లబ్ధిదారునికి అందించారు. ఈకార్యక్రమంలో అవనాపు శ్రీనివాస్, గుజ్జు నారాయణరెడ్డి, 54వ వార్డు టీడీపీ బూత్ కన్వీనర్, 54వ వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని, అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.