పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో మైనారిటీ శాఖామంత్రి ఫరూక్‌ను కలిసిన దేవాడ రైతులు
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 77వ వార్డులోని దేవాడ గ్రామానికి చెందిన ముస్లింలు, హిందువులు, ఇతర మైనారిటీలు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కలసి సోమ వారం అమరావతిలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారుక్‌ను కలిశారు. వారు మంత్రికి వినతిపత్రం అందజే శారు. ఇందులో వారు కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఎన్నో ఏళ్లుగా 18 గ్రామాల ప్రజలు 3000 ఎకరాల భూమిలో నివసిస్తూ పూర్తి హక్కులు పొందలేకపోతున్నామని, 2008 వ సంవత్సరంలో ప్రభుత్వ జీవో నంబరు 10తో ఈ భూము లపై పూర్తి హక్కు వక్ఫ్ బోర్డుకు కల్పించడం వలన దేవాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న భూములపై ఆధారపడి నివసి స్తున్న 18 గ్రామాల ప్రజలు రైతులు కుటుంబాలు జీవన జీవ నోపాధి కోల్పోయారని వివరించారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో వక్ఫ్ భూములలో ఉన్న రైతులకు 3000 ఎకరాలకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదని, గృహ నిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేయడం లేదని వినతి పత్రంలో తెలియజేశారు. హిందుజా పరిశ్రమ రైల్వే లైన్ నిమిత్తం సేకరించిన భూములకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని వివరించారు. భూములలో పరిశ్రమలకు ఇచ్చిన విధంగా రైతులు చిన్నచిన్న కుటీర పరిశ్రమలు పెట్టు కోవాలని వారికి రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలన్నారు. అదేవిధంగా ఈ భూములలో ఉన్న గ్రామ కంటాల్లో ఇప్పటికే నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందిం చి దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన వార్డు అధ్యక్షులు కాకి బాబు, టీడీపీ అధ్యక్షులు అచ్చిల నాయుడు, నాయకులు మంత్రి రవి, వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు సర్వరే ఆలం, మైనార్టీ నా యకులు బాబా, సత్తార్, రజాక్, సిరాజ్, హఫీజ్, అహమ్మద్, ఆన్సర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.