ఏసీబీ దాడిలో అవినీతి వీఆర్వో సత్యవతి
కల్యాండ్ మ్యుటేషన్ కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేసిన వైనం
కరూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సింగరాయి వీఆర్వో
అక్షర కిరణం, (వేపాడ/విజయనగరం): వేపాడ మండలంలో ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. సింగరాయి వీఆర్వో సత్యవతి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో సత్యవతి సింగరాయితోపాటు ఎన్కే ఆర్.పురం సచివాలయాలకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహి స్తున్నారు. సింగరాయి, గుడివాడ రెవెన్యూ పరిధిలో ల్యాండ్ మ్యుటేషన్ కోసం లక్ష డెబ్బైవేలు రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా వేపాడ సమీపంలో ఏసీబీ అధికారులు వీఆర్వో సత్యవతిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ దాడి లో డీఎస్పీ ఎన్.రమ్య, సీఐ మహేశ్వరరావు, ఎస్ఐ వాసు నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.