జీఎస్టీ కొత్త పన్నులపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరి
కరాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ఎల్వీ చలం
అక్షర కిరణం, (విశాఖపట్నం): కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వస్తు సేవల పన్ను( జీఎస్టీ) సోమవారం నుండి తగ్గింపుపై వినియోగదారులకి అవగాహన తప్పనిసరి అని రాష్ట్రవిని యోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ఎల్ వెంకటా చలం అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో పేద మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేసే దాదాపు 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గించడం వినియో గదారులకు కొంత ఊరట లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. వంటగది సరుకులు కొన్ని, విద్యార్థి వినియోగించే పుస్తకాలు పెన్నులు స్టేషనరీ తదితరాలపై అలాగే ఇన్సూరెన్స్‌కి సంబంధించి జీరో పన్ను విధించడం ఉపయోగకరమైన దన్నారు. రైతులు వినియోగించే ఎరువులు పురుగు మందులు ట్రాక్టర్లపై 12 శాతం నుండి ఐదు శాతం తగ్గిం చడం నిత్యవసర సరుకులు 18 శాతం నుండి 5 శాతం తగ్గించడం ఔషధాలు సంబంధించి 12 శాతం నుండి 5 శాతం తగ్గించడం క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధులకు వినియోగించే 36 ఔషధాలపై పూర్తి జీఎస్టీ తొలగించడం చాలా ఉపయోగకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న నూతన విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంపై వినియోగదారులు హర్షం తెలుపుతున్నారన్నారు. అయితే కొత్తగా ట్యాక్స్‌కి మార్పులను వినియోగదారులు విక్రయించేటప్పుడు అమ్మకపుదారులు టాక్స్‌కు సంబంధించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాత ధరలకే అమ్మే విధంగా జరిగితే సంబంధిత జీఎస్టీ అధికారులకు వినియోగదారులు ఫిర్యాదులు చేయాలని తెలిపారు. షాపింగ్‌మాల్స్, స్థానిక దుకాణాదారులు వినియోగదా రుల సందేహాలపై అవగాహన కల్పించాలే తప్ప వారిపై అనుచితంగా వ్యవహరించరాదన్నారు. సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ చేసి వినియోగదారులకు బాసటగా నిలవాలని కోరారు.