సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయండి
కజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఒప్పందం ప్రకారం నిర్ణీయత సమయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యా లయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం జీవీఎంసీ అభివృద్ధి పనులు నిర్ణీత సమ యంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖ నగరాభి వృద్ధికి కాంట్రాక్టర్లు కూడా భాగస్వాములేనని, ప్రతి కాంట్రా క్టర్ వారికి ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్ కాల్ ఫర్ చేసినప్పటి నుండి పనులు పూర్తయ్యే వరకు పనులలో ఎటువంటి జాప్యం ఉండరాదని ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. ప్రతి పని రూల్ బుక్ ప్రకారం పూర్తయ్యే విధంగా ప్రతిరోజు పనులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ పనులు పూర్తయిన వెంటనే వరుస క్రమంలో బిల్లులు చెల్లించేందుకు సహకరిస్తానని కమిషనర్ కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈసమీక్షలో సమావేశంలో పర్యవేక్షక ఇంజనీర్లు కేవీఎన్ రవి, పీవీవీ సత్యనారాయణ రాజు, కార్యనిర్వహక ఇంజినీర్లు, ఉప కార్యనిర్వహక ఇంజినీర్లు, జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.