అలరించిన చిన్నారుల దుర్గమ్మ నృత్య ప్రదర్శనలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తు న్నారు. విశాఖపట్నం మహానగరం గాజువాకలో అతిపెద్ద సెలస్ట్ అపార్ట్మెంట్లో వందలాది మంది నివాసితుల మధ్య దుర్గమ్మ ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. మహిషాసుర మర్ధని, దుర్గమ్మ దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు నిర్వాహకులను, చిన్నారులను అభినందించా రు.