రూ.62,130 సీఎం సహాయనిధి చెక్కు అందజేత
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. జీవీఎంసీ 95వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు కంచిపాటి మధు సమక్షంలో జీవీఎంసీ 95వ వార్డు పొర్లుపాలెం గ్రామానికి చెందిన గాలి జ్ఞాన సాయి అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పక్షంలో పెందుర్తి అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ ముమ్మన సతీష్ సహా యంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ను కలిసి ఆయన సహకారంతో మంజూరైన రూ.62,130 సీఎం సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కృష్ణమోహన్, కిషోర్, సతీష్, మహేష్, రాము, శ్రీనివాస రాజు, గొల్లవిల్లి గణేష్, వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.