ఢల్లీిలో బాబా అరాచకం: ఆశ్రమంలోని 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు
కపరారీలో స్వామి చైతన్యానంద
కతీవ్రంగా గాలిస్తున్న ఢల్లీి పోలీసులు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ఢల్లీిలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న ఓ బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 17 మంది విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఢల్లీిలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విద్యార్థినులు ఆరోపించారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కు చెందిన యువతులు స్కాలర్‌షిప్‌లతో ఈ విద్యా సంస్థ లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులను అభ్యసిస్తోన్న 32 మందిలో 17 మంది వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అసభ్యపదజాలంతో తమ దూషించి, మేసేజ్‌లు పంపడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్వామి చైతన్యానంద చెప్పినట్టు వినాలని మహిళా టీచర్లు, సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలోని వార్డెన్లు తమను నిందితుడికి పరిచయం చేసినట్టు బాధితులు వెల్లడిరచారు. విద్యార్థినులు ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద కేసు నమోదుచేసినట్టు వాయువ్య ఢల్లీి డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతం, వేధింపులు జరిగినట్టు బాధితులు పేర్కొన్న ప్రదేశా ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే, సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను విశ్లేషించారు. ప్రస్తుతం స్వామి చైతన్యానంద పరారీలో ఉన్నారని, అతడి చివరి లొకేషన్ ఆగ్రా సమీపంలో ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. అతడి కోసం పోలీసు లు ముమ్మరంగా గాలిస్తున్నారు. శ్రీశారద మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ బేస్మెంట్లోని కారుకు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఒడిశాకు చెందిన ఈ స్వామీజీ... 12 ఏళ్లుగా ఢల్లీి ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో ఓ కేసు నమోదుకాగా.. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. తాజా ఆరోపణలతో శ్రీ శృంగేరీలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డ్ ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యా నందతో సంబంధాలను తెంచుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడు స్తోంది. ఢల్లీి కేంద్రంలో రెండు బ్యాచ్‌లతో పీజీ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తుండగా.. ఒక్కో బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులు ఉన్నారు.