లోక్ కల్యాణ మేళాపై వీధి విక్రయదారులకు అవగాహన
అక్షర కిరణం, (విశాఖపట్నం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళ వీధి విక్రయదా రులు సద్వినియోగపరచుకోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పీఎం సత్యవేణితో కలి సి జోన్-6 జోనల్ కార్యాలయంలో లోక్‌కళ్యాణ్ మేళా (పీఎం స్వనిధి2.0) కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వీధి విక్రయదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారికి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి2.0 రుణాలు, డిజిటల్ లావా దేవీలపై లబ్ధి, క్రెడిట్ కార్డులు, టంంaఱ సర్టిఫి కెట్లు, సోషియో ఎకానమీ సర్వే, జీఎస్టీ తదితర సదుపాయాలు కల్పిస్తారని చెప్పారు. వీధివిక్రయదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవే శపెట్టిన సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థి కంగా బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో యూసీడీ పీడీ సత్యవేణి, కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొన్నారు.