బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు
అక్షర కిరణం, (పొందూరు): బాల్య వివాహాలను నిర్మూ లించాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం లోని సమావేశ హాల్లో అతను స్వయం శక్తి సంఘాల సభ్యులు, అంగన్వాడీ సభ్యులతో జాతీయ న్యాయ సేవాధి కార సంస్థ ఆశ పధకం ప్రకారం బాల్య వివాహాలు నిర్మూల నపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో అతను మాట్లాడుతూ 21 సంవత్సరాలు నిండని పురు షులు 18 సంవత్సరాలు నిండని స్త్రీలు వివాహం చేసు కొంటే దానిని బాల్య వివాహంగా పరిగణిస్తారని, బాల్య వివా హాలు వల్ల పిల్లల విద్య దెబ్బ తింటుందని తెలిపారు. శిశు మరణాల రేటు పెరుగుతుందని, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం తదితర సమస్యలు వస్తాయని అతను తెలియజే శారు. బాల్య వివాహం చేసుకున్నవారికి, బాల్య వివాహం జరిపించినవారికి బాల్య వివాహాలను ప్రోత్సహించినవారికి కఠినమైన శిక్షలు విధిస్తారని హెచ్చరించారు. ఈ సదస్సులో పొందూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాది ఎం.రాము, పొందూరు మండల ఎంపీడీవో ఎస్.వాసుదేవారావు, పొందూరు మండల మహిళా సామా ఖ్య కార్యాలయం ఏపీఎం జి.శ్యామ్, పొందూరు మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు పి.అరుణ, పొందూరు మండల ఐసీడీఎస్ పీవో ఎంవీకే సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.