అరుణాచలంలో దారుణం
కఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం
అక్షర కిరణం, (అరుణాచలం/జాతీయం): తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిపై తమిళనాడు పోలీస్ విభాగానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వాహనంలో ఉన్న ఆమెను కిందకు దింపి, పొలాల్లోకి లాక్కెళ్లి అత్య్షాచరం చేశారు. ఈ షాకింగ్ ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువన్నామలై (అరుణాచలం) సమీపంలో జరి గింది. వివరాల్లోకి వెళ్తే... ఎంథాల్ బైపాస్ వద్ద సోమవారం రాత్రి గస్తీలో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.. టమాటాలు తీసుకెళ్తున్న ట్రక్కును ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనంలో ఉన్న యువతిని చూసిన పోలీసులు.. అనుమానం ఉంది ప్రశ్నించాలంటూ దిగమని చెప్పారు. ఆమె వాళ్లు చెప్పినట్టు చేయకపోయేసరికి కోట్టి కిందకు దింపారు.
అనంతరం ఆ యువతిని బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. ఆమెను బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. అచేతన స్థితిలో ఉన్న బాధితురాలిని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులు గుర్తించారు. బాధితురాలిని రక్షించి, అంబులెన్స్‌కు సమా చారం ఇచ్చి, చికిత్స కోసం అరుణాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతుంది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను సుందర్, సురేశ్ రాజ్‌గా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధాకర్, అసిస్టెంట్ సూపరింటిండెంట్ సతీశ్ ఆసుపత్రికి చేరుకుని బాధిత యువతిని కలిశారు. ఆమెను విచారించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసు లు.. నిందితులైన ఇద్దరు కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు చెప్పిన సమాచారం ఆధారంగా ఎస్పీ సుధాకర్ ఘటానా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే, తిరువణ్ణామలై మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఐదుగురు ఎస్ఐలు సహా 10 మందికి పైగా పోలీసులను మోహరించారు. నిందితులు పోలీసులే కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
కాగా, ఈ ఘటనకు రెండు రోజుల కిందటే చిత్తూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి మహిళకు కూల్ డ్రిరక్‌లో మత్తుమందు కలిపి తాగించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు, ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే ముగ్గురు పిల్లలను చంపేస్తామని బెదిరించారు. దీనిపై చాలాసార్లు పోలీసు లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. రెండు వారాల తర్వాత బాధితురాలు మీడియా ముందుకు రావడంతో ఆ ఇద్దరి దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. పుంగనూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న కానిస్టేబుల్ ఉమాశంకర్, హోమ్ గార్డు కిరణ్ కుమార్‌పై విచారణకు ఆదేశించారు.