ఏయూ అధ్యాపక పోస్టులు విక్రయం?
కన్యాయం చేయాలంటున్న బాధితులు కేటగిరి
కవైస్ చాన్స్లర్కు బాధితుల వినతిపత్రం
ఆంధ్ర యూనివర్సిటీకి దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఇందులో చదవాలని, ఇందులో ఉద్యోగం చేయాలని ఎంతోమంది కలల కంటారు. ఇంత ఘన చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కొంతమంది విభాగ అధిపతుల బంధుప్రీతి , అవినీతి కారణంగా యూనివర్సిటీ పరువు,ప్రతిష్ట, దగ్గర్లో ఉన్న సముద్ర తీరంలో కలిసిపోతుంది. ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని, తమకు న్యాయం చేయాలని కొంతమంది బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు.
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఏయూలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి నాలుగు మాసాల క్రితం యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయూలోని ప్రతి విభాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. దీనికోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు, నెట్, సెట్లో ఉత్తీర్ణత చెంది ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిన చేరితే ఎప్పటికైనా ఉద్యోగం రెగ్యులర్ అవుతుంది అన్న ఆశతో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూలు జరిగాయి.
చక్రం తిప్పిన డిపార్ట్మెంట్ హెడ్లు: ఈ నియామకాల్లో ఎక్కడ పార దర్శకత పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ హెడ్లు ఈ నియామకాల్లో చక్రం తిప్పి, తమకు నచ్చిన వారికి, బంధు వర్గానికి, 10 లక్షలు ఇచ్చినవారికి ఉద్యోగాల్లో సెలెక్ట్ చేసిన ట్టు కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక విభాగాధిపతి తన రెండవ భార్యకు ఈఉద్యోగం కట్టబెట్టినట్లు వారు చెబుతున్నారు.
న్యాయం చేయాలంటున్న బాధితులు: పైరవీలకు, రాజకీయ సిఫారస్తులకు, బంధుప్రీతికి, అవినీతికి ఈ నియామకాల్లో పెద్దపీట వేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి న్యాయపోరాటం కోసం సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై న్యాయం చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జిపి రాజశేఖర్, రిజిస్టర్ ధనుంజయరావుకు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఈ నియామకాలపై సిఐడి, విజిలెన్స్ లాంటి సంస్థలతో దర్యాప్తు జరిపితే అసలు విషయం బయట పడుతుందని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.