ఏపీటీఎఫ్ నిరసన వారం పోస్టర్ ఆవిష్కరణ
అక్షరకిరణం, (మాధవధార): ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన చేయనున్నట్లు విశాఖ జిల్లా ఏపీటిఎఫ్ అధ్యక్షులు కరుణాకర రావు తెలిపారు. మంగళవారం ఏపీటిఎఫ్ కార్యాలయంలో నిరసన వారం పోస్టర్ ఆవిష్కరించారు.పెండిరగులో ఉన్న డీఏలు, సీపీఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిమితిని 25లక్షలకు పెంచాలని నిరసన వారాన్ని ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీిఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ రామకృష్ణరావు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.