కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడు అరెస్టు
అక్షర కిరణం, (విశాఖపట్నం): కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడుని అరెస్టు చేసినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి 9 చైన్ స్నాచింగ్ కేసులు, రెండు బైకు దొంగతనాలు కేసులు ఛేదించినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు. వివరాలను పోలీసులు వెల్లడిరచారు. ప్రధాన నిందితుడు ధర్మేంద్ర కుమార్ (34)పై జమ్మూ కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు తెలి పారు. జమ్ము కశ్మీర్లో 9, ఢల్లీిలో 1 కేసు, ఉత్తర ప్రదేశ్‌లో 11 కేసులు, ఒడిశాలో 3 కేసులు ధర్మేంద్ర కుమార్‌పై నమోదైనట్టు తెలిపారు. విశాఖపట్నంలో 7 స్నాచింగ్ కేసులు, 2 బైక్ చోరీ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ బవేరియా గ్యాంగ్‌లో ధర్మేంద్ర కుమార్: ప్రధాన నిందితుడని, ఆపరేషన్లలో ముందుండి పనిచేశాడని తెలిపారు. మిగిలిన సభ్యుల్లో సూరజ్ చోరీలకు పకడ్బందిగా ప్రణాళికలు వేస్తాడని, కొత్త ఫోన్లు, సిమ్‌లు సమకూర్చి, గ్యాంగ్‌ను విశాఖకు రప్పించాడని తెలిపారు. మూడో నిందితుడు కపిల్: బైక్ లాక్‌లు విరగగొట్టడంతోపాటు, స్నాచింగ్ సమయంలో ముందుండేవాడని చెప్పారు. నాలుగో నిందితుడు హజారే సింగ్ చోరీల్లో సహకారిస్తుండే వాడని చోరీ చేసిన బంగారం విక్రయించడంలో పంచుకోవడంలో కీలక పాత్ర ధారి అని తెలిపారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు విలువైన ఆభరణాలు, వస్తువులు మెడలో ధరించి వెళ్లే సమయంలో చున్నీ కానీ చీరనుగాని ఆ వస్తువులు కనిపించకుండా కప్పుకొని భద్రంగా వెళ్లాలన్నారు. పరిచయం లేని వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులు పోలీసులమని చెప్పి నమ్మించే వ్యక్తులు, ఎవరైనా వస్తువులు తీసి భద్రపరిచి ఇస్తామని చెప్పినట్లయితే అటువంటివారిని నమ్మరాదని సూచించారు. పరిచయం లేని వ్యక్తులను ఇంట్లోకి రానివ్వరాదని కోరారు. ఎవరైనా బంగారం మెరుగు పెడతామంటూ వచ్చేవారు. డెలివరీ బాయ్స్, ప్యాకేజ్ బాయ్స్ వస్తే వారి గుర్తింపు కార్డు చూసి వారిని బయటనే ఉంచాలని, లోనికి రానివ్వరాదని సూచించారు. ఎవరైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా, అనుమానాస్పద సంఘటన లు గమనించినా, వెంటనే పోలీస్ సమాచార కేంద్రం 112 కి కాల్ చేయాలని డీసీపీ క్రైమ్స్ లతా మాధురి సూచించారు.