జీవీఎంసీలో 21 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని ఆయన ఛాంబర్లో జీవీఎంసీలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న 21 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తరువులను అందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా విధుల్లో అంకిత భావంతో పని చేయాలని, బాధ్యతను విస్మరించకుండా తెలియని విష యాలను అధికారుల నుండి సూచనలు సలహాలు తీసు కొని విధులు నిర్వహిస్తూ జీవీఎంసీకి మరింత పేరు ప్రతిష్ట లు తేవాలని సూచించారు. తదుపరి పదోన్నతి పొందిన ఉద్యోగులు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వులను అందించినందుకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు, కమిషనర్ కేతన్ గార్గ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అప్పలనాయుడు, జీవీఎంసీ పర్యవేక్ష కులు సన్యాసిరావు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.