పీజీఆర్ఎస్లో 13 దరఖాస్తులు స్వీకారం
అక్షర కిరణం, (పలాస): పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టిడ్కో ఇళ్లు మంజూరు, ఖాళీ స్థలాల పన్ను కోసం పలు సమస్యలపై మొత్తం 13 దరఖాస్తులు అంది నట్టు మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తెలిపారు. అందులో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల కోసం-6, టిడ్కో ఇల్లు మంజూరు కోరుతూ - 4 ఖాళీ స్థలాల పన్ను కొరకు - 3 మొత్తం 13 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ తెలిపారు. టిడ్కో ఇళ్ల సమస్యలపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుండి తగిన మార్గదర్శకాలు వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తెలియజేసారు.