జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 వినతులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 106 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణ రాజు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వీ నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవ రెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, పర్య వేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, శ్రీనివాసరావు, సంపత్ కుమార్, డీడీహిెచ్ దామోదరరావు, కార్యనిర్వాహక ఇంజి నీర్లు రాయల్ బాబు, ఎంఆర్ఎస్ అప్పారావు, యూసీడీ పీవో ప్రసన్నవాణి, డీపీవో విజయశంకర్, శాంతికుమారి, డీసీపీలు వెంకటేశ్వరావు, హరిదాసు, మధుసూదనరావు, రామమోహనరావు, ఏసీపీలు, సీవీవో డాక్టర్ కిషోర్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, బయాలజిస్ట్ సాంబమూర్తి, టి.పి.ఆర్.ఒ రజినికుమారి తదితరులు పాల్గొన్నారు.